వరద ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ELR: వేలేరుపాడు తహసీల్దారు కార్యాలయంలో గురువారం కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో వరద ప్రభావం, సహాయ పునరావాస కార్యక్రమాలపై సమీక్షించారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెప్టెంబరు నెలలో ప్రసవించే గర్భిణులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.