రాష్ట్రస్థాయి పోటీల్లో మండపేట క్రీడాకారుల ప్రతిభ

రాష్ట్రస్థాయి  పోటీల్లో మండపేట క్రీడాకారుల ప్రతిభ

కోనసీమ: మండపేట డిగ్రీ కళాశాల వద్ద రెండు రోజులుగా జరుగుతున్న 49వ రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. మొత్తం 17 జిల్లాల నుంచి 136 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని పురుషుల విభాగంలో ఆరుగురు మహిళల విభాగంలో ఆరుగురు విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో మండపేటకు చెందిన క్రీడాకారులు రామారావు, వినయ్‌లు అత్యుత్తమ ప్రతిభ చూపారు.