YCP నేతతో పోలీసుల తీవ్ర వాగ్వాదం
ATP: YCP నేత పెద్దారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేడు పట్టణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీలు చేపట్టారు. అయితే TDP నేత అస్మిత్ రెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో YCP చేపట్టిన కార్యక్రమాన్ని మరోచోటికి మార్చుకోవాలని పోలీసులు సూచించడంతో ఈ వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.