అడవి పందులు అడ్డురావడంతో వ్యక్తి మృతి
NRML: దస్తూరాబాద్ మండలం రేవోజీపేట వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నిర్మల్ నుంచి బుట్టాపూర్ వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డు రావడంతో నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కోరిటికల్ గ్రామానికి చెందిన గంగాధర్ (40) ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో పవన్ కుమార్‌కు గాయాలయ్యాయి.