పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈరోజు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో పింఛన్లు ఒకరోజు ముందే అందజేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం లక్ష్యం పేదల ముఖంలో ఆనందం చూడటమేనని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం రూ.4000 పింఛన్లు అందిస్తుందన్నారు.