VIDEO: గంజాయి సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్
జనగామ పట్టణ శివారులో గంజాయి వినియోగంపై అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి సుమారు 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రంజిత్ పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.