తణుకులో పొలం పిలుస్తోంది కార్యక్రమం

W.G: తణుకు మండలం తేతలి గ్రామ శివారు కొండయ్యపాలెం పుంతలో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. మండలం వ్యవసాయ అధికారి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో, ఇటీవల అధిక వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు జి.నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.