VIDEO: కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
SRPT: జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం తెచ్చిన జీవో 252ను వ్యతిరేకిస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట TUWJ (H-143) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్రిడిటేషన్ల సంఖ్యను కుదిస్తూ, డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య విభజన తెచ్చే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. జీవోను సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.