మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ తనిఖీలు
ELR: చింతలపూడి మండలంలోని పలు మద్యం దుకాణాల్లో మంగళవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుకాణంలోని మద్యం నిల్వలను పరిశీలించారు. అలాగే బాటిల్లను స్కాన్ చేసి వాటి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మద్యాన్ని విక్రయించాలని తెలిపారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.