కార్యకర్తలపై దాడులు ఆపకపోతే తిరగబడక తప్పదు: KTR
సూర్యాపేట జిల్లా లింగంపల్లి గ్రామంలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. KTR మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతోందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే తాము కూడా తిరగబడక తప్పదని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ శ్రేణులను ఆయన అభినందించారు.