మృతుని కుటుంబానికి మంత్రి భరోసా

ELR: చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన ఏ.కిరణ్ ఇటీవల కరెంట్ షాక్‌తో మృతి చెందగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. కిరణ్ చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేసి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.