గోదావరి ఉగాది.. సంస్కృతికి నిలువుదట్టం

గోదావరి ఉగాది.. సంస్కృతికి నిలువుదట్టం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉగాది వేడుకలు అంటే పండగ మాత్రమే కాదు, అదొక సాంస్కృతిక వైభవం. ఈ సమయంలో ప్రభల తీర్థాలు కనువిందు చేస్తాయి. గోదావరి తీర ప్రాంతం కావడంతో గంగమ్మ పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో చెరుకు రసంతో చేసే పచ్చడి ప్రత్యేకం. రైతులు నాగలి పూజ చేసి ఎరువాక సాగిస్తారు. అలాగే, ఈ ఏడాది వర్షపాతాల గురించి పండితులచే అడిగి తెలుసుకుంటారు.