రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జిల్లా అధ్యక్షులు
E.G: కిర్లంపూడి మండలం వీరవరం గ్రామం నుంచి చిన్న తిరుపతి గ్రామానికి వెళ్లే రోడ్డు పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతకు ఇది నిదర్శనం అని జ్యోతుల నవీన్ పేర్కొన్నారు.