వరుసగా రెండో రోజు.. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ

వరుసగా రెండో రోజు.. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ

TG: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. రెండు రోజులుగా పెట్రోల్ బంకుల వద్దకు పెద్ద ఎత్తున వాహనదారులు తరలివస్తుండటంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ దొరకదేమోననే భయంతో ముందస్తు జాగ్రత్తగా స్టాక్ ఉంచుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. దీంతో గంటల తరబడి వేచి ఉంటూ తిప్పలు పడుతున్నారు.