కేజీబీవీ బాలిక విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

VZM: కొత్తవలస పట్టణ శివారు అడ్డూరివానిపాలెం వద్ద ఉన్న కేజీబీవీ బాలికల విద్యాలయంలో నిన్న రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఐన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ అధికారులతో కలిసి బుధవారం అన్ని గదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కడ కనబడలేదని తెలిపారు.