VIDEO: పైనంపల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో భక్తుల సందడి
KMM: మహాశివరాత్రి పురస్కరించుకుని నేలకొండపల్లి మండలం పైనంపల్లిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.