'జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి'

'జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి'

KMM: జార్జిరెడ్డి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని విద్యారంగ సమస్యలపై విద్యార్థులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని PDSU జిల్లా ఉపాధ్యక్షుడు గాంధీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం ఇంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో జార్జిరెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా సభ నిర్వహించారు. ఓయూలో PDSUను స్థాపించి అన్యాయాలకు ఎదురొడ్డి, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని గుర్తుచేశారు.