VIDEO: మూసారంబాగ్ బ్రిడ్జి మూసివేత

HYD: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఈ జలాశయాల నుంచి మూసీ నదిలోకి నీరు విడుదల కావడంతో వరద ప్రవాహం పెరిగింది. దీంతో ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుని బ్రిడ్జిని తాకుతున్నాయి. దీంతో అధికారులు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు.