గుత్తి మండలంలో మొదలైన చేపల వేట

ATP: భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లుతుండటంతో చేపల పండుగ నెలకొంది. వరదల్లో ఎదురెక్కి వస్తున్న చేపలను స్థానికులు, గ్రామస్థులు పట్టుకెళ్తున్నారు. గుత్తి మండలం చెట్నేపల్లి గ్రామ సమీపంలోని పెద్ద ఉప్పు వంక వద్ద గ్రామస్థులు చేపల వేటను కొనసాగిస్తున్నారు. దీంతో గత మూడు రోజులుగా ఆ గ్రామంలో చేపల సందడి ఉంది.