'విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి'
MBNR: విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగాలని జడ్చర్ల SI అక్షయదీప్ అన్నారు. ప్రజా భద్రత పోలీసు బాధ్యత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సన్‌రైజ్ పాఠశాలలో పోలీసు సురక్ష కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, బాల్య వివాహాలు అంశాలపై అవగాహన కల్పించారు.