యూరియా వాడకం తగ్గించాలి: మంత్రి తుమ్మల

యూరియా వాడకం తగ్గించాలి: మంత్రి తుమ్మల

TG: వ్యవసాయ రంగంలో మరిన్ని మార్పులు అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. వరి సాగులోనూ పాక్షికంగా ఆరుతడి విధానం పాటించాలని సూచించారు. పురుగుల మందులు, యూరియా వాడకం బాగా తగ్గించాలని చెప్పారు. వాటి వాడకంతో క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని పేర్కొన్నారు. యూరియా అధికంగా వాడటం వల్ల పంజాబ్‌ ప్రజల్లో క్యాన్సర్‌ ముప్పు పెరిగిందని వెల్లడించారు.