VIDEO: వెల్దుర్తిలో జాతీయ ఓటర్ దినోత్సవం
MDK: వెల్దుర్తి మండల కేంద్రంలో ఆదివారం జాతీయ ఓటర్ హక్కు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అధికారులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల గుండా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం ఏర్పాటుచేసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు.