VIDEO: 'ప్రణాళిక ప్రకారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం'
WNP: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ ఆదర్శ సురభి నేడు సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. స్కూల్ భవనాల నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులను ప్రణాళిక ప్రకారం కొనసాగించాలని ఇంజినీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.