భ్రమరాంబను దర్శించుకున్న మండల కన్వీనర్

భ్రమరాంబను దర్శించుకున్న మండల కన్వీనర్

NDL: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని మండల కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. కార్తీక మాసంలో నేడు 3వ సోమవారం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందుకునట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మొక్కలు తీర్చుకునట్లు తెలిపారు.