కౌలాస్ నాల ప్రాజెక్టు గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

KMR: కౌలాస్ నాల ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. సోమవారం ప్రాజెక్టుకు 697 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తారు. ప్రస్తుతం దిగువకు 1142 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదల కొనసాగుతుండటంతో పరివాహక ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటి సామర్థ్యం 1.213/1.237 టీఎంసీలకు చేరుకుంది.