అందెశ్రీకి నివాళులర్పించిన బీజేపీ అధ్యక్షుడు
MDCL: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి అందెశ్రీ మరణం తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. లాలాపేటలోని తన నివాసంలో ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి స్వరం ఇచ్చిన గొప్పకవి అందెశ్రీ అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.