పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం: వెంకటరామిరెడ్డి

ATP: వైసీపీలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. పార్టీ అనుబంధ విభాగాలలో పదవులు పొందిన వారు ఆయనను కలిశారు. పుష్ఫగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.