గవర్నర్ పురస్కారాలకు నామినేషన్ల గడువు పెంపు
TG: గవర్నర్ పురస్కారాలకు నామినేషన్ల గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించినట్లు గవర్నర్ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ తెలిపారు. ఆదర్శప్రాయమైన సేవలు చేసిన వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టులను గుర్తించి వారికి పురస్కారాల ప్రదానం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత గలవారు డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటలలోపు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.