'సచివాలయ ఉద్యోగులచే రేషన్ పంపిణీ బాధాకరం'

GNTR: సచివాలయ ఉద్యోగులచే రేషన్ పంపిణీ చేయాలని పొన్నూరులో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ తెనాలి పట్టణ అధ్యక్షుడు జానీ భాషా డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం బాధాకరమని పేర్కొన్నారు. సెప్టెంబరు నెలాఖరులోగా నోషనల్ ఇంక్రిమెంట్లు, సీనియారిటీ జాబితా ఇవ్వకపోతే ఆందోళన చేపడతామని సోమవారం హెచ్చరించారు.