ALERT: నేడు, రేపు భారీ వర్షాలు

ALERT: నేడు, రేపు భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఇవాళ ఏలూరు, NTR, పల్నాడు, ప్రకాశం, KNL, నంద్యాల జిల్లాల్లో భారీగా, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది.