స్థానిక సంస్థల ఎన్నికలకు సమిష్టి కృషి

VZM: స్థానిక సంస్థల ఎన్నికలకు సమిష్టి కృషి అవసరమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గజపతినగరంలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు విభేదాలు విడనాడి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.