అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: MLA

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: MLA

PPM: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, అందులో భాగంగానే రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం అడ్డాపుశీల నుంచి పిన్నింటి రామినాయుడువలస వరకు NREGS విధులు 75 లక్షలతో నిర్మాణం చేపట్టిన బీటీ రోడ్డుకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.