VIDEO: సన్నూరులో వైభవంగా వడి బియ్యం
WGL: రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో ధనుర్మాస గోదా అమ్మవారి వడి బియ్యం కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోదాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, వడి బియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగింది.