PHC ని సందర్శించిన Dy.DM & HO
KMR: భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.విజయ మహాలక్ష్మి సందర్శించారు. ఫార్మసీ, ల్యాబ్, పేషెంట్ ఇన్వార్డ్ గదులను పరిశీలించారు. రికార్డులు, రిజిస్టర్లు తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తోడ్పాటు అందించాలని ఆదేశించారు.