శ్రీసిటీలో టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
TPT: శ్రీసిటీలోని పేక్స్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(PETI) సంస్థ తమ ఆవరణలో అత్యాధునిక NABL నీటి, మురుగునీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. దీనిని బుధవారం ప్రారంభించారు. శ్రీసిటీ ఎండీ డా. సన్నారెడ్డి మాట్లాడుతూ.. శ్రీసిటీని 'క్లీన్, గ్రీన్' పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పానికి ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు.