ముమ్మరంగా వాహనాల తనిఖీలు
ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి స్థానిక పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని ఆపి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.