ఖైదీల పట్ల వివక్ష చూపించరాదు

VZM: విజయనగరం సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీకుమారి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారాగార పరిసరాలు, వంట గది, లీగల్ ఎయిడ్ క్లినిక్, తదితర వాటిని పరిశీలించి సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. అనంతరం ఖైదీలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు వివక్ష చూపించరాదన్నారు.