కంది పంటను పరిశీలించిన అగ్రికల్చర్ అధికారి

కంది పంటను పరిశీలించిన అగ్రికల్చర్ అధికారి

ATP: విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామంలోని రైతు సేవ కేంద్రాన్ని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పెన్నయ్య శుక్రవారం సందర్శించారు. అనంతరం గ్రామంలో రైతులు ఆరబోసిన కంది పంటను ఆయన పరిశీలించారు. కంది పంటకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 7750 అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాఘవేంద్ర, ఆర్బీకే సిబ్బంది పాల్గొన్నారు.