నేడు బండమ్మ తల్లి అనుపోత్సవం

AKP: సబ్బవరం మండలం ఆరిపాక, పెదయాతపాలెం పాలెం, చిన్నయాత పాలెం గ్రామాల ప్రజల ఆరాధ్య దేవత బండమ్మ తల్లి అనుపోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. మధ్యాహ్నం అమ్మవారి ఊరేగింపు నిర్వహించిన అనంతరం అనుపోత్సవం జరుగుతుందన్నారు.