జగిత్యాల చేరుకున్న కేసీఆర్
TG: మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల BRS కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. అంతకముందు కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద కేసీఆర్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.