తిరుపతిలో మరోసారి చిరుత సంచారం

తిరుపతిలో మరోసారి చిరుత సంచారం

AP: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీ ఎంప్లాయిస్ క్వార్టర్స్ దగ్గర చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. చిరుత సంచారంతో విద్యార్థులు, ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్నఅటవీశాఖ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.