బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ

HNK: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కాజీపేటలో బీజేపీ నాయకులు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ కాజీపేట మీదుగా హన్మకొండ చౌరస్తా వరకు సాగింది. ఇందులో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో పాల్గొన్నారు.