కెన్యా తీరంలో చిక్కుకున్న వేలాది లగ్జరీ కార్లు

కెన్యా తీరంలో చిక్కుకున్న వేలాది లగ్జరీ కార్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో జపాన్‌లోని యోకోహామా నుంచి దుబాయ్‌కి చేరాల్సిన వేలాది లగ్జరీ కార్లు కెన్యా తీరంలో చిక్కుకుపోయాయి. ఇప్పటికే దాదాపు 4,000 కార్లు ఇక్కడ చిక్కుకుపోగా.. వచ్చే వారం మరో 5,000 వాహనాలు రానున్నట్లు నౌకాశ్రయ అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ కార్లను ఇక్కడే ఉంచనున్నట్లు వెల్లడించారు.