'14 నుంచి పల్లె పండగ'

KRNL: మద్దికెర మండలంలో 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పల్లె పండగ - పంచాయతీ వార్షికోత్సవాలు నిర్వహిస్తామని ఎంపీడీవో కొండయ్య తెలిపారు. 14న బసనేపల్లి, 15న బొమ్మనపల్లి, 16న ఎడవల్లి, 17న బురుజుల, 18న హంప, 19న పెరవలి, అగ్రహారం, మద్దికేర కేంద్రంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఇందులో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పాల్గొంటారన్నారు.