మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన

MDK: నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఎస్సై రాజేశ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మాదకద్రవ్యాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తుకు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే ఆన్ లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయని సెల్ ఫోన్లలో అపరిచిత వ్యక్తులను నమ్మోద్దన్నారు.