'మరమ్మత్తులు చేసి నెల గడవకముందే రోడ్డుపై మళ్లీ గుంతలు'
KMM: మధిర- దేందుకూరు రహదారిపై ఏర్పడ్డ గుంతల కారణంగా ఇటీవల మరమ్మత్తు పనులు చేపట్టారని స్థానికులు తెలిపారు. కాగా రోడ్డుపై మరమ్మతులు చేసి నెల రోజులు గడవకముందే మళ్లీ రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయని చెప్పారు. పనులను నాసిరకంగా చేయడం వల్లే రోడ్డుపై పెచ్చులు ఊడి గుంతలుగా మారాయని చెప్పారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.