మడికొండ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్

మడికొండ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్

HNK: కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా జరిగింది. ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డులు, పరికరాలు చూపించి అవగాహన కల్పించారు. సామాజిక దురాచారాలు, ఆన్‌లైన్ మోసాలపై విద్యార్థులకు సూచనలు చేశారు.