VIDEO: వినూత్న రీతిలో మున్సిపల్ కార్మికుల నిరసన

MDK: రామాయంపేట మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రెండు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి భిక్షాటన చేసి నిరసన తెలిపారు. వేతనాలు చెల్లించే వరకు విధుల్లోకి హాజరుకామని, వీధులు శుభ్రం చేయకుండా నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు చెల్లించాలన్నారు.