కనకదుర్గ ఆలయంలో గోల్డ్ అప్రైజర్ చోరీకి యత్నం
NTR: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో గోల్డ్ అప్రైజర్ షమీ దొంగతనానికి యత్నించాడు. సోమవారం కానుకల లెక్కింపు సమయంలో వ్యర్థాలతో పాటు బంగారం, వెండి వస్తువులు బయటకు తీసుకెళ్తుండగా బోర్డు సభ్యులు గుర్తించారు. సుమారు రూ.1.30 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఈవో స్పందించి షమీకి నోటీసులు జారీ చేశారు.