TGSPF పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పిన డీజీ
HYD: బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం కుదిరినట్లు HYDలో TGSPF DG స్వాతి లక్రా తెలిపారు. దీని ద్వారా భీమా పరిమితులను పెంచారు. ప్రమాద మరణానికి రూ.1.25 కోట్లు, సహజ మరణానికి రూ.10 లక్షలు కవరేజీగా నిర్ణయించారు. అదనంగా డెబిట్ కార్డుకు రూ.10 లక్షలు, క్రెడిట్ కార్డుకు రూ.20 లక్షల బీమా కల్పించారు. ఇందుకు నెలకు కనీసం ఒకసారి క్రెడిట్ కార్డు వాడాల్సి ఉంటుదని తెలిపారు.